
రామగిరి: అందరూ సమిష్టిగా కృషి చేస్తే అత్యుత్తమ నాక్ గ్రేడును పొందవచ్చని ఉప కులపతి ఫ్రొఫెసర్ సీహెచ్ గోపాల్ రెడ్డి(వైస్ ఛాన్సలర్ ఎంజీ యూ నివర్సిటీ) అన్నారు. బుధవారం మహత్మగాంధీ యూనివర్సిటీలో జరిగిన రెండో విడుత నాక్ గ్రేడింగ్ కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2017 నుంచి న్యూయార్క్ పరిశీలన చేసే అంశా ల్లో మార్పు వచ్చిందని కొత్త విధానంలో వచ్చిన మార్పులను అనుసరించి విశ్వవిద్యాలయా న్ని సంసిద్ధం చేయాలని, ఆ దశలో మంచి గ్రేడ్ సాధించవచ్చని ఆయన పిలుపునిచ్చారు.
విశ్వవిద్యాలయంలోని ప్రతి విభాగంలో పరిశోధన సెమినార్లు, శిక్షణలు మొదలైనటువంటి రికార్డులను భద్రపరిచి న్యాక్ బృందానికి సమర్పించాలని తెలియజేశారు. ఈ విషయంలో ఉస్మానియా విశ్వ విద్యాల యంలో ఫ్రొఫెసర్ అయిన శ్రీరామ్ వెంకటేశ్వర్లు, డాక్టర్ శ్రీనివాస్ సహయ సహకారాలు తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షణ నియంత్రణాధికారి శ్రీరామ్వెంకటేశ్, ఉస్మానియా అసోసియేట్ ప్రొఫె సర్ డాక్టర్ శ్రీనివాస్ రావు, ఐక్యూఎసీ డైరెక్టర్ డాక్టర్ శ్రీదేవి, కన్వీనర్ లక్ష్మీప్రభ, ప్రిన్సిపాల్ డాక్టర్ అంజిరెడ్డి, డాక్టర్ ఉపేం దర్‌రెడ్డి, పరీక్షణ నియంత్రణాధికారి మిరియాల రమేశ్, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ దోమల రమేశ్, అడ్మిషన్స్ డైరెక్టర్ ఆకుల రవి, డైరెక్టర్ డాక్టర్ వసంత, వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.