శాలిగౌరారం, మే 15 : శాలిగౌరారం ప్రాజెక్టు నీటి మట్టం పెరుగుతున్నది. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు మూసీనది ప్రవహిస్తుండడంతో రామన్నపేట మండలం పల్లివాడ హెడ్‌వర్క్ నుంచి శాలిగౌరారం ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతున్నది.
గత నెల క్రితం అడుగంటిన ప్రాజెక్టులోకి వరద నీరు రావడంతో జళకళ సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 21అడుగులకు ప్రస్తుతం 14అడుగులు ఉన్నది. దాంతో ఆయకుట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.