
నల్లగొండ: వార్డుల్లో నూతనంగా ఎన్నికైన సారథులు శక్తి వంచన లేకుండా పని చేసి పార్టీని బలోపేతం చేయాలని నల్ల గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం వార్డు కమిటీల చివరిరోజు సందర్భంగా పట్టణంలోని ఆయా వార్డుల నూతన అధ్యక్షులను ఎన్నుకోని మాట్లాడారు.
పార్టీ పటిష్టంగా ఉంటేనే ప్రభుత్వం ఏర్పాటు కావటంతో పాటు అందరికి ఏదో ఒక పదవి కూడా వస్తుందన్నారు. పట్టణంలో పార్టీని ఇంకా బలోపేతం చేయాల్సి ఉందని, కౌన్సిలర్లు పార్టీ అధ్యక్షులు సమన్వయంతో మిగిలిన సభ్యులను అనుబంధ కమిటీల వారిని కలుపుకోని వెళ్లాలని సూచించారు.
సీఎం కేసీఆర్ రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో ప్రజోపయోగకర పథకాలు ప్రవేశ పేట్టనున్నారని ..వీటిని ప్రజలకు చేర్చా ల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. అందరూ సమన్వయంతో ఇప్పటి వరకు ఏకగ్రీవంగా నూతన అధ్యక్షులను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం అధ్యక్షులను సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు, పంకజ్ యాదవ్, యామ కవితా దయాకర్, శ్రీనివాస్, గంజి రాజేందర్ పాల్గొన్నారు.