
కట్టంగూర్, జనవరి 10 : రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికను అందంగా ముస్తాబు చేశారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ అంతటి శ్రీను, ఏఈఓ పరశురాములు, వార్డు సభ్యుడు రెడ్డిపల్లి మనోహర్, టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు బొల్లెద్దు యాదయ్య, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చౌగోని జనార్దన్, నాయకులు యర్కల శ్రీను, అంజయ్య పాల్గొన్నారు.
శాలిగౌరారం : టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఎండ్లబండ్లు, ట్రాక్టర్ల ప్రదర్శన నిర్వహించారు. అందంగా అలంకరించిన బండ్లకు రైతుబంధు సమితి మండల కన్వీనర్ గుండా శ్రీనివాస్ రూ.15వేలు అందించారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ గంట లక్ష్మమ్మ, జడ్పీటీసీ ఎర్ర రణీలాయాదగిరి, తాళ్లూరి మురళి, కట్టా వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ గుజిలాల్ శేఖర్‌బాబు, మామిడి సర్వయ్య, చాడ హతీశ్రెడ్డి, గంట శంకర్, కిష్టయ్య, పొన్నెబోయిన వెంకన్న పాల్గొన్నారు. పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. సంఘం చైర్మన్ తాళ్లూరి మురళి, సీఈఓ నిమ్మల అంజనేయుగౌడ్, డైరెక్టర్లు పనికెర కిష్టయ్య, అక్కెనపెల్లి లింగయ్య, పద్మావతి, కర్నాటి శంకర్, నరేశ్, సుమన్ పాల్గొన్నారు.
గుర్రంపోడు : ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రైతువేదికలో రైతు బంధు సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్, మండల వ్యవసాయ అధికారి కంచర్ల మాధవరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యుడు కంచర్ల విజయేందర్ రెడ్డి, మండలాధ్యక్షుడు బల్గూరి నగేశ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఆర్. భాస్కర్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
చిట్యాల : మండలంలోని ఉరుమడ్ల, చిన్నకాపర్తి, వెలిమినేడు, గుండ్రాంపల్లి, చిట్యాల పట్టణంలో రైతుబంధు సంబురాలు ఘనంగా నిర్వహించారు. చిట్యాలలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మెండె సైదులు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి జిట్ట చంద్రకాంత్, నాయకుటు గుండెబోయిన సైదులు, జిట్ట బొందయ్య, కోనేటి కృష్ణ, సిలువేరు శేఖర్, రుద్రవరం యాదయ్య, దాసరి నర్సింహ, చిత్రగటి ప్రవీణ్, మారగోని రమేశ్, గంట శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి అమరేందర్‌రెడ్డి, ఆవుల ఆనంద్, చిర్రబోయిన యాదయ్య, నర్సింహ, శ్రీశైలం పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి : మండలంలోని తొండల్వాయి గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అంజయ్య, దంతూరి చంద్రయ్య, చింత సైదులు, చింత శివశంకర్, విక్రం, మేడిపల్లి వెంకన్న పాల్గొన్నారు.
నాంపల్లి : మండలంలో రైతుబంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు ఎస్డబ్ల్యూ లింగోటంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఎండ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు, అధికార ప్రతినిధి పోగుల వెంకట్‌రెడ్డి, మాల్ మార్కెట్ డైరెక్టర్లు కడారి శ్రీశైలం యాదవ్, నడింపల్లి యాదయ్య, సపావత్ సర్దార్, కోన్‌రెడ్డి ఏడుకొండల్, సుధకార్ పాల్గొన్నారు.
చండూరు : మండల కేంద్రంలోని అంగడిపేట నుంచి కస్తాల వరకు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. చండూరు మున్సిపల్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకట్‌రెడ్డి, జడ్పిటీసీ కర్నాటీ వెంకటేశం, మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న, మండలపార్టీ అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, పట్టణాధ్యక్షుడు భూతరాజు దశరథ, యువజన విభాగం అధ్యక్షుడు ఉజ్జిని అనిల్‌రావు మహిళా విభాగం అధ్యక్షురాలు పెండ్యాల గీతా,కౌన్సిలర్లు కోడి వెంకన్న, చిలుకూరి రాధికా శ్రీనివాస్, అన్నెపర్తి శేఖర్, కొన్రెడ్డి యాదయ్య, సర్పంచులు పాల్గొన్నారు.
మర్రిగూడ : మండలంలోని అంతంపేటలో ఉపసర్పంచ్ వీరమల్ల రాజుగౌడ్ వ్యవసాయ పొలంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ బాలం నర్సింహ, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు పందుల పాండుగౌడ్,యూత్ అధ్యక్షుడు ఆంగోతు హరిప్రసాద్నాయక్, ప్రధానకార్యదర్శి ఐతరాజు స్వామి, వార్డు సభ్యుడు ఆకారపు శ్రీనివాస్, మాతంగి నరేందర్, రవీందర్, గూడెపు నర్సింహ, సురిగి ఎట్టయ్య, వెంకట్ పాల్గొన్నారు. మండలకేంద్రంలోని రైతువేదిక వద్ద జరిగిన సంబురాల్లో ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, ఏఓ స్పందన, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్‌యాదవ్, యూత్ అధ్యక్షుడు హరిప్రసాద్నాయక్, సర్పంచ్ నల్ల యాదయ్య, టీఆర్ఎస్ నాయకులు బచ్చు రామకృష్ణ, ఐతగోని వెంకటయ్యగౌడ్, మారగోని రామన్న, లపంగి నర్సింహ, నగేశ్ పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : మండలంలోని నర్సింగ్‌బట్ల గ్రామ రైతు వేదిక వద్ద సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చామకూరి తేజస్వినీతిరుమలేశ్ గౌడ్, ఎంపీటీసీలు రాజుపేట మల్లేశ్‌గౌడ్, నర్సింగ్‌బట్ల క్లస్టర్ పరిధిలోని సర్పం చులు గుండెబోయిన శ్రీలత జంగయ్య, కారింగ్ సైదులు, రైతుబంధు సమితి అధ్యక్షుడు విఘ్నేశ్గౌడ్, బడుపుల శంకర్, బొల్లేపల్లి శంకర్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గుండెబోయిన సైదులు, ఏఈఓలు కీర్తన, విజయరాణి, కోదాండంపాల్గొన్నారు.
డీఏఓ కార్యాలయంలో..
నల్లగొండ : జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 3 నుంచి జిల్లా వ్యాప్తంగా రైతాంగం రైతుబంధు సంబురాలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ హుస్సేన్ బాబు, మన్నాన్, గిరిప్రసాద్, శ్రీనివాస్, శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.