అన్నదాతల ఇంట సాయం సంతోషం
రైతుబంధు డబ్బులు శనివారం ఐదు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 8.64 లక్షల మంది రైతులకు 705.48 కోట్ల రూపాయలు అందాయి.
- రైతుల ఖాతాకు పంట పెట్టుబడి సాయం
- ఇప్పటివరకు ఐదెకరాల్లోపు రైతులందరికీ రైతు బంధు
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.705.48 కోట్లు
వానకాలం పంటల సాగుకు సంబంధించి రైతుబంధు డబ్బులు అన్నదాతల ఖాతాలో జమ అవుతున్నాయి. శనివారం ఐదెకరాల్లోపు రైతులందరికీ పంట పెట్టుబడి సాయం అందింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 8.64 లక్షల మంది రైతులు 705.48 కోట్ల రూపాయలను పొందారు.
– నల్లగొండ ప్రతినిధి, జూలై 1 (నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, జూలై 1(నమస్తే తెలంగాణ) : రైతుబంధు డబ్బులు శనివారం ఐదు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 8.64 లక్షల మంది రైతులకు 705.48 కోట్ల రూపాయలు అందాయి. తొలిరోజు ఎకరం లోపు రైతులతో మొదలైన పెట్టుబడి సాయం ఇప్పటివరకు ఐదు ఎకరాల్లోపు రైతులకు అందింది. శనివారం ఒక్క రోజే ఉమ్మడి జిల్లాలో మొత్తం 18,515 మంది రైతులకు రూ.32.42 కోట్లు జమ కాగా, అందులో నల్లగొండ జిల్లాలో 9,729 మంది రైతులకు రూ.16.28 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 4,186 మంది రైతులకు రూ.7.86 కోట్లు, యాదాద్రిభువనగిరి జిల్లాలో 4,600 మంది రైతులకు రూ.8.28 కోట్ల రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పటివరకు మొత్తం నల్లగొండ జిల్లాలో 4,23,509 మంది రైతులకు రూ. 352.78 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 2,37,655 మంది రైతులకు రూ.191.40 కోట్లు, యాదాద్రిభువనగిరి జిల్లాలో 2,03,641 మంది రైతులకు రూ.161.29 కోట్లు పెట్టుబడి సాయంగా నగదు జమ అయ్యింది. ఇలా పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు వానకాలం సీజన్లో పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.
రైతుబంధు అందిందిలా..
- నల్లగొండ జిల్లా 4,23,509 రైతులు
- సూర్యాపేట 2,37,655
- యాదాద్రి 2,03,641
ఐదు రోజుల్లో జిల్లాల వారీగా….

Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

