ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిషరించాలి
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిషరించాలని ఆర్టీసీ యాదగిరిగుట్ట డిపో కార్మికులు డిమాండ్ చేశారు.
యాదగిరిగుట్ట, మార్చి 3 : దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిషరించాలని ఆర్టీసీ యాదగిరిగుట్ట డిపో కార్మికులు డిమాండ్ చేశారు. ఆదివారం యాదగిరిగుట్ట డిపో దగ్గర కార్మికులు యూనియన్లకు అతీతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.
పెండింగ్లో ఉన్న రెండు పీఆర్సీలను వెంటనే చెల్లించాలని, ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన బంద్ కాలం నాటి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆర్టీసీ కార్మికుల సమస్యలను తెలియజేసేందుకే ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. సీఎం రేవంత్రెడ్డి కార్మికుల పక్షపాతిగా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిషారానికి చొరవ చూపుతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు మురళి, కృష్ణయ్య, కుమార్, రమేశ్, యాదగిరి, నగేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

