నీలగిరి, అక్టోబర్ 14 : ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రోడ్డు విస్తరణ పనులను నాణ్యతలో సకాలంలో పూర్తి చేయాలని నల్లగొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ అధికారులను కోరారు. మంగ సతీశ్నగర్లోని మొయిన్ రోడ్డు డ్రైనేజీ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. ప్రజల అవసరాల కోసం మొయిన్రోడ్డులో డ్రైనేజీ, రోడ్డు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులు అనుకున్న ప్రకారం నాణ్యతతో పూర్తి చేస్తామని, ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. నల్లగొండ పట్టణంలో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట కాలనీ వాసులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.