నల్లగొండ, జూలై 16 : మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ కట్టా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తిరుమలగిరి సభలో జగదీశ్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ ఎదుట బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కట్టా శ్రీనివాస్ మాట్లాడుతూ.. సిగ్గుంటే 50 ఎండ్ల కాంగ్రెస్ పాలనలో నల్లగొండలో జరిగిన అభివృద్ధి, బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.
చెప్పుకునేందుకు చేసిన అభివృద్ధి ఏమి లేకనే ప్రజలను మభ్యపెట్టడానికే జగదీశ్‌రెడ్డిపై విమర్శలు చేశారన్నారు. బీఆర్ఎస్ నాయకుల మీద మొరగడం ఆపి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అంబటి ప్రణీత్, కత్తుల జైచందన్, జెట్టి శివప్రసాద్, ఎన్జీ కళాశాల అధ్యక్షుడు బాలాజీ నాయక్, వెంకటేశ్, సాయి, రాము, వెంకన్న, రాజు పాల్గొన్నారు.