కోదాడ, డిసెంబర్ 10 : సామాజిక సేవలో విశ్రాంత ఉద్యోగులు ముందుంటారని ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో చలికి వణుకుతున్న నిరుపేదలకు, యాచకులకు స్వయంగా వెళ్లి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా తమ సంఘం ఆధ్వర్యంలో ఏదో ఒక రూపంలో సమాజ సేవ చేస్తూనే ఉన్నట్లు తెలిపారు. నిరుపేదలకు, ఆపదలో ఉన్నవారికి ప్రతి ఒక్కరూ తమకు అవకాశం ఉన్నంత మేరకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు బాలు, రాంబాబు, కోదాడ సంఘ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, సంఘ బాధ్యులు తిరుపతమ్మ, వీరారెడ్డి, రఘువర ప్రసాద్, భ్రమరాంబ, అహమ్మద్, విద్యాసాగర్, శోభారాణి, భిక్షం పాల్గొన్నారు.