నల్లగొండ సిటీ జూన్ 24 : కోరిన కోర్కెలు తీర్చే శ్రీరేణుకా ఎల్లమ్మ. జమదగ్ని మహర్షి 24వ వార్షిక కల్యాణోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా దేవాలయం నుంచి కళ్యాణ మండపం వరకు మంత్రి పట్టు వస్ర్తాలు సమర్పించారు. అనంతరం కల్యాణోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవారి ఆలయాన్ని అన్నీ విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, అలయ చైర్మన్ చీదేటి వెంకట్‌రెడ్డి, ఆలయ ఈవో అంబటి నాగిరెడ్డి, తాసీల్దార్ పద్మ, ఎంపీడీవో వేద రక్షిత, గ్రామ సర్పంచ్ రాయల శేఖర్, ఆలయ మాజీ చైర్మన్ గోపాల్‌రెడ్డి, ఆలయ అర్చకులు శ్రావణ్‌కుమార్, నాగోజు మల్లాచారి పాల్గొన్నారు.