చౌటుప్పల్, అక్టోబర్ 1 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా కుదేలైంది. గత రెండేండ్లుగా ఈ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. గతంలో రియల్ ఎస్టేట్ రంగం లో తెలంగాణ దూసుకుపోయినా.. ప్రస్తు తం మాత్ర నేలచూపులు చూస్తోంది. దీంతో అత్యవసరాల కోసం ఆస్తులు అమ్ముకోవాలంటే సామాన్య జనం నానా తంటాలు పడాల్సి వస్తోంది. కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో చేసేదేమీ లేక ఓ వ్యక్తి తన సింగిల్ రూమ్‌ను లక్కీడ్రా వేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చౌటుప్పల్‌కు చెందిన కంచర్ల రాంబ్రహ్మచారి హైవే పక్కనే ఉన్న 66 గజాల తన ఇంటి స్థలాన్ని రూ.16 లక్షలకు అమ్మకానికి పెట్టా డు. ఇటీవల మార్కెట్ పడిపోవడంతో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు లక్కీడ్రా పేరుతో విక్రయానికి పెట్టాడు. రూ. 500తో లాటరీ టికెట్లు అమ్మకానికి పెట్టాడు. నవంబర్ 2న డ్రా తీయనున్నారు. ఈ డ్రాలో గెలుపొందిన విజేతకు ప్లాటు ఇవ్వనున్నారు. ఇది చూసి చాలామంది రియల్ ఎస్టేట్ వ్యా పారులు కాంగ్రెస్ పాలనలో తెలంగాణలోని భూముల దుస్థితి ఇదీ అంటూ నెట్టింట్లో కామెంట్లు పెడుతున్నారు. పట్టణంలోని ప్రతీ నోట ఇదే చర్చ సాగుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రియల్ రంగం ఢమాల్ అనడంతో జిల్లాలోని వ్వవసాయ భూములు, ప్లాట్లకు డిమాండ్ బాగా తగ్గింది. గత రెండేండ్లుగా క్రయ విక్రయాలు పడిపోయాయి. పిల్లల చదువులు, పెండ్లిండ్లు, విదేశాలకు పంపేందుకు డబ్బుల కోసం ప్లాట్లు అమ్ముకోవాలనుకునే వారు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. ఆర్థిక అవసరాల కోసం గత్యంతరం లేక అడ్డికి పాపుశేరు లెక్కన అమ్ముతున్నారు.ఇలా జిల్లాలో వేలాది ఎకరాల వ్యవసాయ భూములు, వేలల్లో ఓపెన్ ప్లాట్లు అమ్మకానికి ఉన్నాయి. కాగా చౌటుప్పల్ మండల వ్యాప్తంగా తీసుకుంటే ప్రస్తు తం ప్రతినెలా 200కు పైగా డాక్యుమెంట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఈ రిజిస్ట్రేషన్ల సంఖ్య 5 రెట్లకు పైగా ఉం టూ కార్యాలయం క్రయ విక్రయ దారులతో కిటకిటలాడుతుండేది.