రామగిరి, మార్చి 24 : విద్యతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, అందుకు క్రమశిక్షణతో ముందుకు సాగాలని నల్లగొండ ఎంఈఓ కత్తుల అరుంధతి అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో గల ది మాస్టర్ మైండ్స్ హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో యూకేజీ, ఐదవ తరగతి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం యూకేజీ (39), ఐదవ తరగతి (18) విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ గుండెబోయిన జానయ్య యాదవ్, ఉపాధ్యాయులు జి.వెంకటేష్, క్రిస్టోఫర్, అరుణజ్యోతి, విజయనిర్మల, రుచిత, నూర్, అశ్విని, ఆస్మా, సనోబర్, దివ్య, స్వర్ణ, హేమలత, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

విద్యతో ఉన్నత స్థాయికి : ఎంఈఓ కత్తుల అరుంధతి