హాలియా, డిసెంబర్ 2 : బడుగు, బలహీన వర్గాల గొంతుక దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం ఆస్ట్రేలియా నాయకుడు రవి సాయల అన్నారు. శుక్రవారం ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో నోముల నర్సింహయ్య ద్వితీయ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజల అభ్యున్నతికి జీవితాంతం పోరాడిన గోప్ప పోరాట యోధుడు నోముల నర్సింహయ్య అని కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం నాయకులు లక్కరుసు రాకేశ్, వీరేందర్, సాంబరాజు, రమేశ్, శ్రీనివాస్, రుద్ర, రవి, ఝాన్సీ, మధు, అనిత్, డాక్టర్ వాసు పాల్గొన్నారు.