Ration Dealer : తిమ్మారెడ్డిగూడెంలో రేషన్ డీలర్‌ను నియమించాలి : జెర్రిపోతుల ధనంజయ
చండూరు మండలంలోని తిమ్మారెడ్డిగూడెంలో రేషన్ డీలర్‌ను నియమించాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. మంగళవారం చండూరు మండల పరిధిలోని తిమ్మారెడ్డిగూడెంలో ప్రజా సమస్యలపై నిర్వహించిన ప్రజా పోరుబాట కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు.
చండూరు, మార్చి 18 : మండలంలోని తిమ్మారెడ్డిగూడెంలో రేషన్ డీలర్‌ను నియమించాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. మంగళవారం చండూరు మండల పరిధిలోని తిమ్మారెడ్డిగూడెంలో ప్రజా సమస్యలపై నిర్వహించిన ప్రజా పోరుబాట కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సింహులగూడెం ప్రధాన బీటీ రోడ్డు నుండి తిమ్మారెడ్డిగూడెం వరకు జరిగే రోడ్డు పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నత్త నడకగా సాగుతున్నాయని, ఈ రోడ్డు పనులు త్వరగా పూర్తిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ గ్రామం నుండి రేషన్ బియ్యం కోసం ప్రజలు రెండు కిలోమీటర్ల దూరం నుండి తుమ్మలపల్లి గ్రామానికి వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను అమలు చేస్తూ మహిళలకు రూ. 2,500 ఇవ్వాలని అలాగే భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని, స్థలం లేని వారికి ప్రభుత్వమే స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా భూమిలేని పేదలకు ఆత్మీయ భరోసా వర్తింపజేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24, 25, 26 తేదీల్లో తాసీల్దార్ కార్యాలయల ఎదుట రిలే నిరాహార దీక్షలను నిర్వహించనున్న తెలిపారు. ఈ దీక్షలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, ఈరటి వెంకటయ్య, గ్రామస్తులు ముత్తయ్య, యాదయ్య, కృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

