చందంపేట ( దేవరకొండ ) జూలై 26 : నేరేడుగొమ్ము, చందంపేట మండలాలకు కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను ఆదివారం లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి తెలిపారు. శనివారం ఆర్డీఓ కార్యాలయంలో చందంపేట, నేరేడుగొమ్ము మండలాల రేషన్ డీలర్ల సమావేశం నిర్యాహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం పోలేపల్లి వద్ద ఉన్న ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో మంత్రి, ఎమ్మెల్యే బాలు నాయక్, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు మంజూరు అయినా రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
చందంపేట మండలంలో 2,086, నేరేడుగొమ్ము మండలంలో 866 మందికి నూతన రేషన్ కార్డులు మంజూరైనట్లు చెప్పారు. కావునా రేషన్ డీలర్లు ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు అవగాహన కల్పించి తీసుకోరావాలని సూచించారు. ఈ సమావేశంలో తాసీల్దార్లు శ్రీధర్ బాబు, హన్మంత్ శ్రీనివాస్ గౌడ్, అయ్యాబ్, ముక్తార్, రేషన్ డీలర్లు మలేశ్ యాదవ్, నరేందర్, పరమేశ్, కృష్ణయ్య, బాషా నాయక్ పాల్గొన్నారు.