– తమిళనాడు తిరుకోవిలూరులో సన్మానం
మునుగోడు, ఫిబ్రవరి 03 : మునుగోడు ప్రాచీన శివరామ ఆలయం అర్చక బృందం, శివ శక్తి పీఠం సభ్యులకు తమిళనాడులోని తిరుకోవిలురులో విశ్వం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8వ అంతర్జాతీయ ఆధ్యాత్మిక జ్యోతిష్య సదస్సులో ఉత్తమ పురస్కారాలు ప్రదానం చేశారు. శివశక్తి పీఠం వ్యవస్థాపకుడు కొండోజు నవీన్ కుమార్, సభ్యులు రామోజు మహేష్ స్మార్త శిరోమణి పురస్కారం, బొల్లోజు శ్రీకాంత్, తిరందాసు ప్రవీణ్ లకు స్మార్త రత్న పురస్కారాలు అందుకున్నారు. దీనిపై మునుగోడు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.