కట్టంగూర్, జూన్ 01 : కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయ పర్యవేక్షులుగా బి.రమేశ్ సోమవారం పూర్తి బాధ్యతలు స్వీకరించారు. కట్టంగూర్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న చింతమల్ల చలపతి సాధారణ బదిలీలో భాగంగా కేతేపల్లికి బదిలీ కాగా ఆయన స్థానంలో నిడమనూరు ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న రమేశ్ కట్టంగూర్ కు వచ్చారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి కార్యాలయ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.