అడ్డగూడూరు, మే 21: ఈ నెల 27న జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలంటే సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం ఉన్న రాకేశ్‌రెడ్డిని పెద్దల సభకు పంపించాల్సిన అవసరం ఉందన్నారు. పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, సింగిల్ విండో మాజీ చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, నాయకులు పాశం విష్ణువర్ధన్, వెంపల్ల నర్సిరెడ్డి, బైరెడ్డి రాంరెడ్డి, నవిన్, చిత్తలూరి నరేశ్, బాలెంల అరవింద్, దాసరి బాలరాజు, గూడెపు పరమేశ్, గజ్జెల్లి రవి, గూడెపు నరేశ్, బాలెంల అయోధ్య, మందుల కిరణ్ పాల్గొన్నారు.
సమస్యలపై ప్రశ్నించే వ్యక్తినే పెద్దల సభకు పంపాలి
మోత్కూరు : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక అయిన బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని మోత్కూరు రైతు సేవా సహకార సంఘం చైర్మన్ కంచర్ల అశోక్‌రెడ్డి కోరారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో పట్టభద్రులను కలిసి ఓటు అభ్యర్థించారు. ప్రజలు, నిరుద్యోగుల శ్రేయస్సు కోసం పని చేసే విద్యావంతుడైన రాకేశ్‌రెడ్డి సరైన అభ్యర్థి అన్నారు. నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు జంగ శ్రీను, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొణతం యాకూబ్‌రెడ్డి, నాయకులు కొండ సోంమల్లు, మర్రి అనిల్‌కుమార్, జంగ నరేశ్ పాల్గొన్నారు.
రాకేశ్‌రెడ్డి గెలుపుకోసం కృషి చేయాలి
ఖమ్మం,వరంగల్,నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు పరిదె సంతోష్ కోరారు. మంగళవారం మండలంలోని పటేల్‌గూడెంలో విలేకరులతో మాట్లాడారు. శాసనమండలిలో పట్టభద్రుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా, వారి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయగల వ్యక్తినే గెలిపించాలని సూచించారు. రాకేశ్‌రెడ్డి గెలుపుకోసం బీఆర్ఎస్ నాయకులు కృషి చేయాలని కోరారు. ఆయన వెంట నాయకులు గుర్రాల రమేశ్, కరికె మల్లేశ్, వెంటిక మధు, బండ జహంగీర్, రమేశ్ ఉన్నారు.