రాజాపేట, సెప్టెంబర్ 19 : రాజాపేట కుమ్మరి సంఘం కమిటీని శుక్రవారం ఆ సంఘ మండల కన్వీనర్ బోనాల వెంకటేశ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చల్మలపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా నాగపురి ప్రవీణ్, కోశాధికారిగా పారెల్లి శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, వెంకటేశం, ఆంజనేయులు, లక్ష్మణ్, పుల్లయ్య పాల్గొన్నారు.