నల్లగొండ,జూన్ 13 : నల్గొండ జిల్లా కలెక్టర్‌గా రాహుల్ శర్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మకు జిల్లా కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా ప్రశాంత్ జీవన్ పాటిల్ గా బాధ్యతలు స్వీకరించగా, నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా రాహుల్ శర్మ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌కు పలువురు జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.