పిచ్చికుక్క స్వైర విహారం.. బాలుడిపై దాడి చేసి గాయపర్చిన ఘటన
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ బాలుడిపై దాడి చేసి గాయపర్చిన సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...
- కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకుంటామన్న అధికారులు
నకిరేకల్, ఏప్రిల్ 3: నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ బాలుడిపై దాడి చేసి గాయపర్చిన సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నకిరేకల్‌లోని శివాజీనగర్‌కు చెందిన గంట శంకర్ సరస్వతి దంపతుల కుమారుడు శరత్చంద్ర(4) పట్టణంలోని సాధన ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. శుక్రవారం సెలవుదినం కావడంతో ఉదయం 9 గంటలకు ఇంటి ఎదుట ఆడుకుంటుండగా పిచ్చికుక్క విచక్షణారహితంగా బాలుడిపై దాడి చేయడంతో అతడి ముఖంపై గాయాలయ్యాయి.
బాలుడు కేకలు వేయడంతో తల్లిదండ్రులు వెంటనే నకిరేకల్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యుడు నీలోఫర్‌కు రెఫర్ చేయడంతో చికిత్స నిమిత్తం బాలుడిని హైదరాబాద్‌కు తరలించారు. ఇటీవల మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పట్టణంలోని పిచ్చికుక్కలు, కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టేందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్, కమిషనర్ రంజిత్‌కుమార్ తెలిపారు. కోతులు, పిచ్చికుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

