నల్లగొండ విద్యావిభాగం(రామగిరి), ఏప్రిల్ 19 : రీసెర్చ్( పరిశోధన) మూలం ప్రశ్నావళి తయారీ అని దానికి ప్రత్యేకమైన స్కేల్స్ ను ఉపయోగించాలని, దాంతో ఫలితం సంపూర్ణంగా ఉంటుందని ఐపిఈ ప్రొఫెసర్ వై. రామకృష్ణ అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అకాడమిక్ రైటింగ్ ఫర్ పీహెచ్డీ స్కాలర్స్ అండ్ యంగ్ టీచర్స్” వర్క్‌షాప్ రెండో రోజు శనివారం కొనసాగింది. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ రామకృష్ణ హాజరై డాటా కలెక్షన్, ఎనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అనే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో శిక్షణకు హాజరైన వారికి వివరించారు. పీహెచ్డీ చేసే పరిశోధన విద్యార్థులు డాటా కలెక్షన్‌కు వెళ్లడానికంటే ముందు ప్రశ్నావళి తయారు చేయడంలో ఉపయోగించే స్కేల్స్ తో పాటు తర్వాత వాటిని ఎనాలసిస్ చేయటానికి ఉపయోగించే ఎక్సెల్ షీట్ లోని డాటా అంశాలను ఉదాహరణలతో సహా వివరించారు.
పీహెచ్‌డీతో పాటు పాటు జనరల్స్, పబ్లికేషన్స్ ఇతర గ్రంథాలను రాసే స్కాలర్స్ తో పాటు అధ్యాపకులు ప్లాగరిజం చెక్ చేసిన తర్వాతే వాటిని సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఫ్లాగరిజం ఉపయోగించే విధానం అర్థమయ్యేలా తెలియజేశారు. అదేవిధంగా ఏ అంశాలను ఏ సైడ్స్ నుంచి లేదా పుస్తకాల నుంచి సేకరించాలి, వాటికి సంబంధించిన బిబ్లియోగ్రఫీ ఎలా పొందుపరచాలి అనే అంశాలని సైతం పీపీటీతో వివరించారు.
రీసెర్చ్ లో ఉపయోగించే టెక్నిక్స్ ఇంటర్‌ప్రిటేషన్స్ అంశాలను మహాత్మాగాంధీ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి వివరించారు. ప్రిన్సెస్ లో సులభంగా టెక్నిక్స్ ను వాడే విధానాలను ప్రాక్టికల్ గా తెలియజేశారు. ఎంజీయూ కామర్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ వర్క్‌షాప్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆకుల రవి మాట్లాడుతూ.. రీసెర్చ్ అంశాలపై నిపుణులైన ప్రొఫెసర్ల చేత అకాడమిక్ రైటింగ్ అంశాలపై అందించే శిక్షణను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమం ముగింపులో రిసోర్స్ పర్సన్స్, సీనియర్ ప్రొఫెసర్స్ ని ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ వర్క్‌షాప్‌లో ఎంజీయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీదేవి, పీడీఎఫ్ స్కాలర్ కొషనోజు రవిచంద్ర, పరిశోధన విద్యార్థి రాంబాబు, ఎంఈడీ, బీఈడి కళాశాల ప్రిన్సిపాల్స్ యాదాచారి, బొడ్డుపల్లి రామకృష్ణ, మిర్యాలగూడ రియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సీనియర్ ఆధ్యాపకుడు ఏ.జగదీశ్వర్ రెడ్డి, తెలంగాణలోని వివిధ యూనివర్సిటీల పీహెచ్డీ స్కాలర్లు, ఎంజీయూ పరిధిలోని యూజీబీజీ కళాశాల సోషల్ సైన్స్ విభాగం అధ్యాపకులు పాల్గొన్నారు.