– 12 బెటాలియన్ కమాండెంట్ వీరయ్య
రామగిరి, ఏప్రిల్ 15 : వేసవిలో వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి తాగునీరు లభించక ఎంతో ఇబ్బందులు పడతారని, అయితే అలాంటి వారి దాహార్తి తీర్చేందుకు స్వచ్ఛందంగా జిగిని సమస్త ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షనీయమని నల్లగొండ అనపర్తి 12వ బెటాలియన్ కమాండెంట్ వీరయ్య అన్నారు. బుధవారం జగిని టెక్స్ టైల్స్, జగిని దంత వైద్యశాల సంయుక్త 12వ బెటాలియన్ ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వేసవి కాలంలో పాదాచారుల దప్పిక తీర్చడానికి గత పదకొండు సంవత్సరాల నుండి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జగిని ఆదిత్య, జగిని వెంకన్న, అడిషనల్ నాగేశ్వర్రావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.