‘విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్‌లు అందించాలి’
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే ఉచిత యూనిఫాంల కుట్టు విషయంలో పూర్తి నాణ్యత పాటించాలని టీఎస్‌యూటీఎఫ్ (TSUTF) నల్లగొండ జిల్లా కార్యదర్శులు గేర నర్సింహ, నలపరాజు వెంకన్న అన్నారు. ఈ మేరకు శుక్రవారం మునుగోడు క్యాంప్ కార్యాలయంలో..
– ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి టీఎస్‌యూటీఎఫ్ వినతి
మునుగోడు, ఏప్రిల్ 10 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే ఉచిత యూనిఫాంల కుట్టు విషయంలో పూర్తి నాణ్యత పాటించాలని టీఎస్‌యూటీఎఫ్ (TSUTF) నల్లగొండ జిల్లా కార్యదర్శులు గేర నర్సింహ, నలపరాజు వెంకన్న అన్నారు. ఈ మేరకు శుక్రవారం మునుగోడు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
నాణ్యత లేని కుట్టు
గత ఏడాది మహిళా సమాఖ్యల ద్వారా కుట్టించిన యూనిఫాంలు నాణ్యత లోపంతో ఉన్నాయని, విద్యార్థుల శరీర కొలతలకు ఏమాత్రం సంబంధం లేకుండా ఉండటం వల్ల అవి వృథా అవుతున్నాయని ఆరోపించారు. సింగిల్ స్టిచ్చింగ్ చేయడం వల్ల నెల రోజులకే కుట్లు ఊడిపోయి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
కుట్టు ఛార్జీల పెంపు
ప్రస్తుత స్టిచ్చింగ్ ఛార్జీలు చాలా తక్కువగా ఉండటం వల్ల టైలర్లు నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారని, అందుకే ప్రస్తుతం ఇస్తున్న జతకు 75 రూపాయల బదులు అదనంగా జతకు 150 రూపాయల చొప్పున కుట్టు ఛార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.
మునుగోడు నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఉన్న 134 పాఠశాలల్లో దాదాపు 7,700 మంది విద్యార్థులు బడుగు, బలహీన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మేలు జరిగేలా మండల విద్యాధికారులతొ సమావేశం నిర్వహించి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ వెంటనే విద్యాధికారులతో సమావేశం నిర్వహించి విద్యార్థులకు నాణ్యమైన దుస్తులు కుట్టుటలో నాణ్యత పాటించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ మండల అధ్యక్షడు బిక్కుమల్ల రాములు, ప్రధాన కార్యదర్శి పెరిక నరసింహ, ఉపాధ్యక్షుడు కూన్‌రెడ్డి సుధాకర్ రెడ్డి, అంజయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

