విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. చివ్వెంల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
- సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
చివ్వెంల/మోతె, జూలై 23 : విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. చివ్వెంల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, అల్పాహారాన్ని పరిశీలించారు. ఏ సబ్జెక్టుల్లో విద్యార్థులు వెనుకంజలో ఉన్నారో గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.
అనంతరం కలెక్టర్ మోతె పీహెచ్‌సీని తనిఖీ చేశారు. మెడికల్ రికార్డు, ఓపీ రిజిస్టర్‌ను పరిశీలించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆ తర్వాత మోతె తాసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రికార్డులను పరిశీలించారు. ధరణి పెండింగ్ ధరఖాస్తులను త్వరితగతిన దరఖాస్తులను పరిష్కరించాలని తెలిపారు.
ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన హెల్ప్ డెస్క్‌ని కలెక్టర్ పరిశీలించి గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాల మార్పుల చేర్పులను ఎప్పటికప్పుడు నవీకరించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట మోతె తాసీల్దార్ సంఘమిత్ర, ఎంపీడీఓ హరిసింగ్ నాయక్, మెడికల్ అధికారి నాగరాజు, ఆర్ఐ మన్సూర్ అలీ, చివ్వెంల పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళారాణి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
Census 2027 | తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఇవే
‘నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

