అర్వపల్లి, ఏప్రిల్ 15 : ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉలెందుల సైదులు అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కోమటిపల్లిలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో ఇంటింటికి మన కోమటిపల్లి అనే నినాదంతో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ బడుల్లో కల్పిస్తున్న మౌలిక వసతులను తల్లిదండ్రులకు వివరించారు. గురుకులాల్లో సీట్లు సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు సృజన, ఏఏపీసీ చైర్మన్ షెమీనా, మాజీ సర్పంచ్ నర్సయ్య, అంగన్వాడీ టీచర్లు శివరంజని, మమత పాల్గొన్నారు.