
దేవరకొండ(కొండమల్లేపల్లి), జనవరి 4 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొండమల్లేపల్లికి చెందిన 30 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలు అందజేసి మాట్లాడారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పేదలు నానా ఇబ్బుందులకు గురయ్యేవారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలు ఆత్మగౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కేసాని లింగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, జడ్పీటీసీ సలహాదారు పసునూరి యుగంధర్‌రెడ్డి, ఉప సర్పంచ్ గంధం సురేశ్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనం ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్, జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, కౌన్సిలర్లు, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
చందంపేట : మండలంలోని పోలేపల్లి గేటు వద్ద టీఆర్ఎస్ జిల్లా నాయకుడు రమావత్ లాలూనాయక్ స్మారకార్థం నిర్వహించే జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రారంభించారు. సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు యాసాని రాజవర్ధన్‌రెడ్డి, గోసుల అనంతగిరి, కేతావత్ శంకర్ నాయక్, నేనావత్ రాంబాబు, లక్ష్మా నాయక్ పాల్గొన్నారు.
దేవరకొండ రూరల్ : మండలంలోని మర్రిచెట్టు తండాలో రూ.4 లక్షలతో డ్రైనేజీలు, రూ.2 లక్షలతో పాఠశాల ప్రహరీ నిర్మాణాలకు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ శంకుస్థాపన చేశారు. సర్పంచులు శ్రీనునాయక్, దీప్లా, చంద్రీలక్ష్మణ్నాయక్, ఎంపీటీసీ గౌతమీరాంసింగ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.