– రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జయలక్ష్మి
– అర్వపల్లి పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ
అర్వపల్లి, మే 25 : సూర్యాపేట జిల్లా అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జయలక్ష్మి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొబైలైజేషన్ ఎయిడ్ సురక్ష కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలను తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సహజ కాన్పులు అయ్యే విధంగా ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గర్భిణులకు అవగాహన కల్పించి కాన్పులు అయ్యే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. మండలంలో క్షయ, కుష్టు వ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలను తెలుసుకుని ల్యాబ్, ఫార్మసీని రికార్డులను పరిశీలించారు.
ఆరోగ్య సిబ్బంది గ్రామ స్థాయిలో వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తూ ప్రజలను అప్రమత్తగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసిద్ధ, వైద్యాధికారి డాక్టర్ భూక్య నగేష్ నాయక్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం అధికారి సుధాకర్,సామాజిక ఆరోగ్య అధికారి బిచ్చు నాయక్, కామేశ్వర రావు, సూపర్వైజర్ లలిత, నర్సింగ్ ఆఫీసర్లు సునీత, మాధవి, కళమ్మ, టిబి మోడల్ పర్సన్ వీరయ్య పాల్గొన్నారు.