గుర్రంపోడ్, జూన్ 09 : పంచాయతీ కార్యదర్శుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని టీపీఎస్డీఎఫ్ జిల్లా స్రెకటరీ గుండగోని సతీశ్ గౌడ్ అన్నారు. ర్రాష్ట పంచాయతీ కార్యదర్శుల జేఏసీ కార్యాచరణలో భాగంగా సోమవారం గ్రురంపోడు మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ పి.మంజులకు 15 సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని పంచాయతీ కార్యదర్శిలతో కలిసి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సతీశ్ గౌడ్ మాట్లాడుతూ.. గత 16 నెలల నుండి ప్రభుత్వం నుండి ఎలాంటి గ్రాంట్ రాకున్నా కూడా పంచాయతీ కార్యదర్శులు తమ జీతాల నుండి ఖర్చు చేస్తూ పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా తమ జీతం నుండి ఖర్చు పెట్టుకోరన్నారు.
డబ్బులు పెట్టలేక కార్యదర్శులు అప్పులపాలు అవుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైన పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్యం పట్టించుకుని పెండింగ్ బిల్లులు చెల్లించి, గ్రాంట్ విడుదల చేయాలని కోరారు. సమస్యలు పరిష్కారించకపోతే సమస్త పంచాయతీ కార్యదర్శిలు కూడా సామూహిక సెలవులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు సీహెచ్. నాగరాజు, ఎన్.సైదులు, ఎన్.జగదీశ్, పి.ప్రశాంత్ పాల్గొన్నారు.