కట్టంగూర్, ఆగస్టు 19 : ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా నాయకుడు పెంజర్ల సైదులు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని మంగళవారం ఆశా వర్కర్లు కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశ వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం ఇవ్వాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు జూలై నెలలో పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం వైద్యాధికారి శ్వేతకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ, జిల్లా కమిటీ సభ్యులు చెరుకు జానకి, ఆశ వర్కర్ల యూనియన్ మండల అధ్యక్షురాలు చౌగోని ధనలక్ష్మి, ప్రధాన కార్యదర్శి భూపతి రేణుక, ఆశ వర్కర్లు అంతటి పద్మావతి, సంతోష, గద్దపాటి భారతి, పెంజర్ల అనిత, సాతీరు రేణుక, గాజుల శ్రీదేవి, కనకతార, పుష్పాంజలి, మంగమ్మ, బొజ్జ సైదమ్మ, సంధ్య, శోభ, నర్సమ్మ పాల్గొన్నారు.