కట్టంగూర్, సెప్టెంబర్ 01 : గ్రామాల్లో పేరుకుపోయిన ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులు గంజి మురళీధర్, పెంజర్ల సైదులు అన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సోమవారం పార్టీ ఆధ్వర్యంలో కట్టంగూర్ డిప్యూటీ తాసీల్దార్ ఫ్రాంక్లిన్ ఆల్బట్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మురుగు కాల్వలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో కంపు వాసన కొడుతూ ప్రజలు రోగాల బారిన పడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో శిథిలమైన రోడ్లకు మరమ్మతులు చేయించి పాత బావులను పూడ్చాలని కోరారు.
కట్టంగూర్‌లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్య అందించాలని, అదేవిధంగా కట్టంగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటలు సేవలందించేదిగా మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు చిలుమల రామస్వామి, జాల అజనేయులు, శాఖ కార్యదర్శి గదపాటి సుధాకర్, పెంజర్ల కృష్ణ, మాజీ సర్పంచ్ రెడ్డిమల్ల భిక్షం, ప్రజా సంఘాల నాయకులు చిలుముల కృష్ణయ్య, నంద్యాల అంతి రెడ్డి, చింత ఎల్లయ్య, చెరుకు యాదగిరి, పన్నాల సర్వయ్య పాల్గొన్నారు.