రామగిరి, అక్టోబర్ 17 : ప్రైవేట్, పీజీ కళాశాలల్లో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్స్ విడుదల చేయాలని నాలుగు రోజులపాటు చేపట్టిన బంద్‌ను తాత్కాలికంగా విరమించినట్లు టీపీడీపీఏంఏ ఎంజీయూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మారం నాగేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
గత సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి ఫ్రీజింగ్లో పెట్టిన టోకెన్లను వారంలో విడుదల చేస్తామని ప్రిన్సిపాల్ సెక్రెటరీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. సీఎంతో చర్చించి తర్వలో గ్రీన్‌చానల్‌తో అందచేస్తామని స్పష్టమైన హమీ ఇవ్వడంతో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నిరసనను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. శుక్రవారం నుంచి కళాశాలలను తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కాగా, గురువారం ఉదయం సూర్యాపేట, భువనగిరి జిల్లా కేంద్రాల్లో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పెద్దఎత్తున బైక్ ర్యాలీ తీసి నిరసన తెలిపాయి.
నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో మహాత్మా గాంధీ విగ్రహానికి యూనియన్ నాయకులు మారం నాగేందర్‌రెడ్డి, కె.రామ్మోహన్, పి.నర్సింహారెడ్డి, గుండెబోయిన జానయ్య వినతి పత్రం అందించారు.