నిడమనూరు, జూన్ 12 : అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పూర్వ ప్రాథమిక విద్యను సద్వినియోగం చేసుకోవాలని నిడమనూరు మండల ప్రత్యేకాధికారి, ఐసీడీఎస్ నల్లగొండ జిల్లా అధికారి కృష్ణవేణి అన్నారు. గురువారం మండలంలోని రాజన్నగూడెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం-2 లో అమ్మ మాట – అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారంతో పాటు మెరుగైన పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నందున మూడేండ్ల చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనుముల ప్రాజెక్ట్ ఐసీడీఎస్ సీడీపీఓ ఉదయశ్రీ, ఏసీడీపీఓ సువర్ణ, సూపర్వైజర్ సైదాబేగం, పంచాయతీ కార్యదర్శి వెంకన్న, అంగన్వాడీ టీచర్లు పాక సునీత, ఏకుల రాజేశ్వరి, ఝాన్సీ లక్ష్మీరాణి పాల్గొన్నారు.