దేవరకొండ రూరల్, జూన్ 13 : దేవరకొండ ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఉత్తమ కండక్టర్, ఉత్తమ డ్రైవర్, ఉత్తమ టీమ్ డ్రైవర్స్, ఉత్తమ మెకానిక్స్, ఉత్తమ శ్రామిక్కి ప్రగతి చక్ర పురస్కరాలను ప్రదానం చేశారు. అనంతరం దేవరకొండ డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ ఎం.శంకర్ నాయక్ కూతురు ఎం.నందు జేఈఈ మెయిన్స్‌లో 1,956వ ర్యాంక్ సాధించడం, అలాగే బురానుద్దీన్ కుమారుడు మహమ్మద్ ఫర్హాన్ పదో తరగతిలో మండల ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు గాను డిపో మేనేజర్ తల్లాడ రమేశ్‌బాబు, అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు వారిని ఘనంగా సత్కరించారు.