త్రిపురారం, మే 27 : నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలోని పలు గ్రామాలకు బుధవారం విద్యుత్ సరఫరా నిలిచిపోనున్నట్లు విద్యుత్ ఏఈ ఎ.బాలు మంగళవారం తెలిపారు. మండలంలోని నీలాయగూడెం సబ్స్టేషన్లో మెయింటెనెన్స్ పనులు చేపడుతున్నందున సబ్స్టేషన్ పరిధిలోని నీలాయగూడెం, అంజనపల్లి, ఘంటారావు క్యాంపునకు బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.