ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
కోదాడ బాలికల ఉన్నత పాఠశాల
కోదాడ, జూన్ 9 : మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో రూ.8లక్షలతో మన బస్తీ-మనబడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్ల విద్యను బడుగు, బలహీన వర్గాల పిల్లలకు చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఆర్ఐలను ఆయన కోరారు. అనంతరం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, ఎంపీపీ కవితారాధారెడ్డి, ఎంఈఓ సలీంషరీఫ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వర్రావు, కౌన్సిలర్లు గుండెల సూర్యనారాయణ, మైసా రమేశ్, పెండెం వెంకటేశ్వర్లు, ఖదీర్, టీఆర్ఎస్ నాయకులు వెంపటి మధుసూదన్, ఉపేందర్గౌడ్, కట్టెబోయిన శ్రీనివాస్, రాజు, గంధం పాండు, మాదాల ఉపేందర్, బత్తుల ఉపేందర్, వంశీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.