కోదాడ, డిసెంబర్ 06 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని కోదాడలో పలు రాజకీయ పార్టీలు, కుల సంఘాల నాయకులు శనివారం నిర్వహించారు. హుజూర్నగర్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పద్మావతి, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎస్.కె నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమర్రి సత్యబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలకు సానుకూలమని స్పష్టం చేశాడని, ఆయన ఆకాంక్షను బాసటగా చేసుకుని ఉద్యమ నేత కేసీఆర్ 14 ఏండ్లు అవిశ్రాత పోరాటం చేసి సబండ వర్ణాలను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అలవాల వెంకట్, గొర్రె రాజేశ్, మేదర లలిత, కర్ల సుందర్ బాబు, రామనేని సత్యనారాయణ, సంగిశెట్టి గోపాల్, చీమ శ్రీనివాసరావు, వంశీ, గంధ ఉపేందర్, కుడుమల సైదులు, పంది లక్ష్మయ్య, బుచ్చారావు, శంకర్, ఉపేంద్ర యాదవ్ పాల్గొన్నారు.

Kodada : కోదాడలో అంబేద్కర్‌కు రాజకీయ నాయకుల ఘన నివాళి