సూర్యాపేటటౌన్, ఆగస్టు 16: జిల్లాలో సంచలనం సృష్టించిన బంగారం చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు. సూర్యాపేట పట్టణంలో జూలై 21వ తేదీ ఆదివారం రాత్రి బంగారం షాపులో 2.5కిలోల బంగారం, డబ్బు చోరీ జరిగింది. షాపు యజమాని ఫిర్యాదుపై సూర్యాపేట టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక పోలీ సు బృం దాలను ఏర్పాటు చేశారు. జూలై 27న సూర్యాపేటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఖమ్మం పట్టణానికి చెందిన యశోదను అరెస్టు చేసి 14తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. యశో ద చెప్పిన ప్రకారం మొత్తం ఏడుగురు నిందితు లు ఈ కేసులో ఉన్నట్లు గుర్తించారు. నేపాల్‌కు చెందిన ప్రకాశ్అనిల్కుమార్తో సహా నేపాల్‌కు చెందిన అమర్భట్, వెస్ట్ బెంగాల్‌కు చెందిన నేరస్థులు ఉన్నట్లు గుర్తించారు. సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు దర్యాప్తు ముమ్మరం చేసి, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, నేపాల్ సరిహద్దుల్లో నిందితుల కోసం గాలించారు. వెస్ట్ బెంగాల్‌లోని దక్షిణ్ దినాజ్ పూర్ జిల్లాలోని తపన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న మాలిక్ మొల్ల అనే దొం గను ఈనెల 11న అతడి స్వగ్రామంలో అరెస్టు చేశారు.
నేపాల్‌కు చెందిన అమర్భట్ను ఖమ్మంలో అదుపులోకి తీసుకొని రూ. 5వేల నగదు సీజ్ చేశారు. మాలిక్ మొల్ల వద్ద నుంచి సుమారు రూ. 60లక్షల విలువైన 554 గ్రాముల బంగారు అభరణాలు, రూ. 87,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు దొరికిన నిందితులను విచారించగా నేపాల్‌కు చెందిన ప్రకాశ్ అనిల్‌కుమార్, కడక్ సింగ్ రాహుల్ వాలియా, పురన్ ప్రసాద్ జోషి, వెస్ట్ బెంగాల్‌కు చెందిన జషీమొద్దీన్తో కలసి సూర్యాపేటలోని సాయి సంతోషి జ్యూవెలర్స్‌లో చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారన్నారు. మా లిక్ మొల్లను కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు పంపామన్నారు. నేపాల్‌కు చెందిన అనిల్‌కుమార్, అమర్ భట్ ఇద్దరు ఖమ్మంలో గుర్ఖాలుగా పని చేస్తూ వచ్చే సంపాదన సరిపోక చోరీలు చేస్తూ జైలుకు వెళ్లి వచ్చారన్నారు. అనంతరం సూర్యాపేటలో రెక్కీలు నిర్వహిస్తూ చోరీలకు పాల్పడేవారన్నారు. మిగతా నిందితుల కోసం ప్రత్యేక పోలీసులు బృందాలు గాలిస్తున్నాయని, త్వరలో మిగతా వారిని పట్టుకుంటామన్నారు. ఈ కేసును పర్యవేక్షించిన డీఎస్పీ ప్రసన్నకుమా ర్, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సీసీఎస్ ఎస్సై హరికృష్ణ, పెన్‌పహాడ్ ఎస్సై గోపీకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ కరుణాకర్, కృష్ణ, శ్రీనివాస్, పాలకీడు సైదులు, ఆనంద్, మల్లేశ్, సతీష్, శివకృష్ణ, ప్రభాకర్లకు ఎస్పీ రివార్డుతో అభినందించారు.