కట్టంగూర్, ఆగస్టు 19 : అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని కట్టంగూర్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఏఎస్ఐ శ్రీనివాసులుతో కలిసి ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ కేక్ కట్ చేశారు. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్స్ మండలాధ్యక్షుడు వేముల బొబ్బిలిరాజా, ప్రధాన కార్యదర్శి రవి, కోశాధికారి కుమార్, ఫొటోగ్రాఫర్స్ వెంకటాచారి, వెల్మకంటి వెంకన్న, అయితరాజు కొండయ్య, బంటు కోటేశ్, శ్యామల తుకారాం, శిగ శ్రీను, వెల్మకంటి శ్రీను, ఇంద్రకంటి సాయికుమార్, కత్తుల శివ, బొడ్డుపల్లి మహేశ్, ఉబ్బని శేఖర్, గద్దపటి శివ, వాసు, దామర్ల శ్రీను పాల్గొన్నారు.