బొడ్రాయిబజార్: ప్రముఖ సినీ నిర్మాణ, డైరెక్టర్, హీరో ఆర్.నారాయణమూర్తి ఆదివారం సూర్యాపేట పట్టణంలో సందడి చేశారు. రైతన్న సినిమా విడుదలైన నేప థ్యంలో సినిమా ప్రచారం కోసం పట్టణానికి చెందిన బీసీ సంక్షేమ సంఘం వర్కిం గ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణపిళ్లె నివాసంలో బీసీ, ఇతర నాయకులను కలసి సినిమాను విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు హజారి రంగయ్య, చలమంద, కౌసల్య, రంజిత్, శ్యామ్సుందర్, చింతలపాటి చిన్నశ్రీరాములు, బొల్లెద్దు వెంకటరత్నం, ఎర్ర వీరస్వామి, కుంభంపాటి రమేశ్, నామా వేణు తదితరులు ఉన్నారు.