వలిగొండ, ఏప్రిల్15 : ఈ నెల 27న వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న రజతోత్సవ మహా సభలను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వల్లమాల కృష్ణ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్గు నవీన్‌గౌడ్ ఆధ్వర్యంలో వలిగొండ మండల పరిధి వేములకొండ గల మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నుంచి యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వరకు మహా పాదయాత్ర చేపట్టారు. దీనికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హాజరై జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు.
మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపు వాగ్దానాలను నమ్మి మోసపోయినట్లు ప్రజలు బాధపడుతున్నారని, కేసీఆర్ పాలనే బాగుందని చర్చించుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలు, కూలీలు, ఆటో కార్మికులు, యువకులు ఇబ్బంది పడుతున్నారని, యావత్ తెలంగాణ సమాజం గోసపడుతున్నదని తెలిపారు.
వరంగల్ మహాసభకు లక్షలాదిగా ప్రజలు, యువకులు, విద్యార్థులు తరలివచ్చి జయప్రదం చేయాలని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మరింత శక్తిని అందించాలని కోరారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రజతోత్సవ మహా సభకు ప్రజలు, అభిమానులు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బూడిద భిక్షమయ్య గౌడ్, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, క్యామ మల్లేశం, పైళ్ల రాజవర్ధన్‌రెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్‌రెడ్డి, నాయకులు పనుమటి మమత నరేందర్‌రెడ్డి, ముద్దసాని కిరణ్‌రెడ్డి, కొమిరెల్లి సంజీవరెడ్డి, డేగల పాండరి, కునపూరి కవిత, పల్సం రమేశ్, గూడూరు శేఖర్‌రెడ్డి, నాగారం ప్రశాంత్, తొట్ల స్వామి, జానీ అఫ్రోజ్, మద్దెల మంజుల తదితరులు పాల్గొన్నారు.