కోదాడ, జూలై 28 : విశ్రాంత ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య, కోదాడ పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ జాస్తి సుబ్బారావు అన్నారు. మంగళవారం విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన సామూహిక పుట్టినరోజు వేడుకలో వారు పాల్గొని మాట్లాడారు. రిటైర్ అయిన తర్వాత ఇంటి వద్ద ఒంటరిగా ఉండకుండా, రోజూ సంఘ కార్యాలయానికి వచ్చి ఆట, పాటలతో సంతోషంగా గడుపాలన్నారు.
కోదాడ యూనిట్ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జన్మదిన వేడుకలు జరుపుకునే వారిచే కేక్ కట్ చేయించి శాలువా, మెమెంటో, పూల బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, బొల్లు రాంబాబు, రఘు వరప్రసాద్, పొట్ట జగన్మోహన్, హనుమారెడ్డి, వెంకటేశ్వరరావు, విద్యాసాగర్, నరసయ్య, ఖలీల్ అహ్మద్, వీరబాబు, భ్రమరాంబ, శోభ పాల్గొన్నారు.