భువనగిరి కలెక్టరేట్, జూన్ 21: వివిధ శాఖల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిషరించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య సంబంధిత అధికారులను ఆదేశించా రు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ అక్షాంక్ష్యాదవ్, ఎస్సీ,ఎస్టీ కమిషన్ కమిటీ సభ్యులతో కలసి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, వివిధ శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వెచ్చిస్తున్న నిధులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారుల కు వివరించారు. అనంతరం మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు నాయ్యం జరిగేలా చూడాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే విషయంలో అలసత్వం వహించరాదన్నారు.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి కేసులు తదితర సంబంధించిన కేసులను త్వరగా పరిషరించాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు సరైన న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదన్నారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖ ల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పెండింగ్ కేసులను పరిషరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని కమిషన్‌కు తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా అర్జీదారుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ స్వయంగా స్వీకరించారు. సమీక్ష సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాసరరావు, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, రాంబాబునాయక్, రేణుకుంట్ల ప్రవీణ్, కొనకాటి లక్ష్మీనారాయణ, జడ్పీ సీఈవో శోభారాణి, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి శ్యాంసుందర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ (ఇన్చార్జి గిరిజన సంక్షేమ శాఖ) అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.