కట్టంగూర్, జులై 3 : మొహర్రం పండుగను పురష్కరించుకుని కట్టంగూర్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం పీర్లను ఘనంగా ఊరేగించారు. కట్టంగూర్, కల్మెర, అయిటిపాముల, బొల్లెపల్లి, చెర్వుఅన్నారం గ్రామాల్లో పురవీధుల గుండా మేళ తాళాలతో ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా పీర్ల నిర్వాహకులు వీధుల్లో పీర్లను ఊరేగిస్తుండగా ప్రజలు పీర్లకు మొక్కి నీళ్లు ఆరబోసి కానుకలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మన్సూర్, సయ్యద్ షకీల్. నాగరాజు, శివ, షబ్బీర్, మహ్మద్ మీరాజ్, అమీర్, సోహెల్, మోహిజ్, మున్ను, సమీర్, ఆసీఫ్ అలీఖాన్, చాంద్ పాషా, హుస్సేన్, నజీర్, అమీర్, రసూల్, పాషా, బాబా పాల్గొన్నారు.