కట్టంగూర్, మే 05 : మానవ సేవే మాధవ సేవ అనే నివాదంతో పలు సేవా కార్యక్రమాల నిర్వహించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్‌లో నిర్వహించిన పెద్ది ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు పెద్ది బాల నర్సయ్యగౌడ్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పెద్ది ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి పేద ప్రజల మన్నలు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం బాలనర్సయ్య గౌడ్‌కు శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోగుల నర్సింహ్మ, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, నాయకులు దాసరి సంజయ్ కుమార్, అంతటి శ్రీను, వడ్డె సైదిరెడ్డి, బీరెల్లి ప్రసాద్, జానీపాష, అంతటి నగేశ్, మేడి రాములు, సోముల వెంకటేశ్వర్లు, మల్లెబోయిన గోపి, రాజకొండ యాదయ్య, గోగు సైదులు, నర్సింగ్ రవి, జిల్లా యాదయ్య. శ్రీపాద రామకృష్ణ, చౌగోని జనార్దన్, పోగుల నర్సింహ్మ, చౌగోని సైదులు పాల్గొన్నారు.