యాదగిరిగుట్ట, మార్చి 28 : మండలంలోని పెద్దకందుకూరు పీఈఎల్ కంపెనీ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో బీఆర్ఎస్కేవీ గెలుపు లాంఛనమేనని కార్మికుల్లో చర్చ నడుస్తుంది. గత రెండు వేతన ఒప్పందాల్లో బీఆర్ఎస్కేవీ చేసిన కృషికి కార్మికుల్లో నమ్మకం పెరుగడంతో మరోసారి గుర్తింపు సంఘంగా బీఆర్ఎస్కేవీకి పట్టం కడితే మరింత లాభం చేకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు. బలమైన కార్మిక సంఘం బీఎంఎస్ సైతం బీఆర్ఎస్కేవీకి మద్దతుగా నిలిచింది. కంపెనీలో 390 మంది కార్మిక ఓటర్లు ఉండగా, అందులో బీఆర్ఎస్కేవీకి 233 మంది బలం ఆ సంఘం నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇతర కార్మిక సంఘాల మద్దతుతో సీఐటీయూ మంది కార్మికుల మద్దతుకే పరిమితమైందని పేర్కొంటున్నారు. అత్యధిక కార్మికుల మద్దతుతో బరిలో నిలిచిన బీఆర్ఎస్కేవీ మరో 20 మంది ఇతర కార్మికుల మద్దతును దీంతో బీఎంఎస్ బలపర్చిన బీఆర్ఎస్కేవీ గెలుపు దాదాపుగా ఖరారైంది. శనివారం ఉదయం 8నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఎన్నికలు జరుగనున్నాయి. సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి.
బీఆర్ఎస్కేవీ కార్మిక సంఘం గత రెండు దఫాలుగా జరిగిన గుర్తింపు ఎన్నికల్లో గెలుపొంది కార్మికులకు అండగా నిలిచింది. 10, 11 వేతన ఒప్పందాల్లో బీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి కంపెనీ యజమాన్యంతో సంప్రదింపులు జరిపి కార్మికులు మెచ్చే వేతన ఒప్పందాలు అమలు చేశారు. 10, 11వ వేతన ఒప్పందాల్లో రూ.11,517 వరకు కార్మికుల జీతభత్యాలను పెంచారు. ట్రైనీ కార్మికులకు రూ.12వేల వరకు వేతనం యాజమాన్యాన్ని ఒప్పించి జూనియర్ కార్మికులకు అగ్రిమెంట్‌ను వర్తింపజేయడంతోపాటు ఏరియల్స్‌ను సాధించారు. ఫెస్టివల్ అడ్వాన్స్ గతంలో రూ.1,500 ఉండగా దానిని రూ.6,500 వరకు పెంచేలా బీఆర్ఎస్కేవీ కృషి చేసింది. కంపెనీ ప్రమాదంలో మృతిచెందిన కార్మికుడి కుటుంబానికి రూ.35 లక్షల పరిహారంతోపాటు కుటుంబానికి రెండు ఉద్యోగాలను ఇప్పించింది. కరోనా లాక్డౌన్ సమయంలో కార్మికులందరికీ 75శాతం వేతనాన్ని కల్పించింది. 8మంది కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా నియమించేలా కృషి చేసింది. ఇటీవల కంపెనీలో జరిగిన పేలుడు ఘటనలో మృతిచెందిన కార్మికుడు కనకయ్య కుటుంబానికి రూ.60 లక్షల పరిహారంతోపాటు ఒక ఉద్యోగాన్ని సాధించింది. ఆరేండ్లుగా పెండింగ్‌లో ఉన్న వీడీఏ పాయింట్ అమౌంట్‌ను రూ.8.50 నుంచి రూ.8.80 వరకు పెంచింది. 20 ఏండ్లుగా పెరుగని ఎల్‌టీఏ అమౌంట్‌ను గ్రేడ్ – 1, 2కు రూ.759 నుంచి 2,750 వరకు, గ్రేడ్ 3, 4కు రూ.వెయ్యి నుంచి రూ.3,250 వరకు, సిబ్బందికి రూ.1,200 నుంచి రూ.3,750 వరకు పెంచిన ఘనత బీఆర్ఎస్కేవీకే దక్కింది. ఈ క్రమంలో శనివారం జరుగబోయే గుర్తింపు ఎన్నికల్లో బీఆర్ఎస్కేవీని మరోసారి గెలిపించాలని కార్మికులు సిద్ధమయ్యారు.
ప్రతి కార్మికుడికి ఇప్పుడున్న వేతనంతో కలుపుకొని రూ.18వేల వరకు వేతన ఒప్పందాన్ని సాధిస్తాం. స్టాఫ్ కార్మికులకు అదనంగా రూ.600 పెంచుతాం. పీఎఫ్ సీలింగ్‌ను ఎత్తివేస్తాం. వీడీఏ పాయింట్ రేటును పెంచుతాం. ఈఎస్ఐ పరిధి దాటిన ప్రతి కార్మిక కుటుంబానికి ఏడాదికి రూ.7లక్షల వరకు వైద్య బీమా పాలసీని పూర్తిగా యాజమాన్యమే భరించేలా కృషి చేస్తాం. ప్రమాదవశాత్తు మృతిచెందిన కార్మిక కుటుంబాలకు వెంటనే ఒకరికి ఉద్యోగ భద్రత, లేకుంటే మంచి ప్యాకేజీ అమౌంట్ ఇప్పిస్తాం. అర్హులైన కార్మికులందరికీ ప్రమోషన్లు, వీడీఏ పాయింట్ ప్రస్తుతం ఉన్న రేటు కంటే రూ.2నుంచి రూ.3వరకు పెంచుతాం. ప్రతి కార్మికుడికి ప్రస్తుతం ఉన్న ఎల్‌టీఏ అమౌంట్ కంటే రెట్టింపు ఏటీఏ ఇప్పిస్తాం. ఫెస్టివల్ సెలవులు, ఎస్ఎల్, సీఎల్ సెలవులను పెంచుతాం. సీనియర్, జూనియర్ల సమన్వయంతో సమన్యాయ వేతన ఒప్పందాన్ని సాధిస్తాం. స్టాఫ్, వర్కర్స్ రిటైర్డ్‌మెంట్‌కు ఒక నెల వేతనాన్ని గిప్ట్గా అందజేస్తాం. రిటైర్డ్మెంట్ నెల మధ్యలో ఉంటే ఆ నెల మొత్తం జీతాన్ని ఇప్తిస్తాం. మృతిచెందిన కార్మికుల అంత్యక్రియల ఖర్చుకు రూ. 50వేల వరకు ఇప్పిస్తాం. మహిళా కార్మికులకు పూర్తి ఉద్యోగ భద్రత కల్పిచడంతోపాటు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తాం. కార్మికులంతా ఒక్కటై బీఎంఎస్ బలపర్చిన బీఆర్ఎస్కేవీ బాణం గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలి.