రామగిరి, మే 18 : కోల్కతాలో జరిగే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) సర్వసభ్య సమావేశానికి తెలంగాణ ప్రతినిధిగా నల్లగొండలోని కెపీఎం ప్రభుత్వ పాఠశాల బొట్టుగూడ ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు ఆహ్వానం అందింది. ఫుట్బాల్ క్రీడను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రోత్సహిస్తూ ఎంతోమంది పాఠశాల విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకు వెళ్లడంలో ఆయన కృషి అభినందనీయమని పలు పాఠశాలల పీడీలు, పీఈటీలు హర్షం వ్యక్తం చేశారు. గిరిబాబు ఈ నెల 22, 23న జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. తనకు ఈ అవకాశం దక్కడంలో భాగస్వామ్యమైన తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్(టీఎఫ్ఎ) చైర్మన్ డా.మహి (శ్రీనిధి), అధ్యక్షుడు మహమ్మద్ రఫత్ అలీ ఐఏఎస్, ప్రధాన కార్యదర్శి జిపి పల్గుణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.