– మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర
నీలగిరి, ఏప్రిల్ 07 : నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో ఉన్న యజమానులు, ప్రజలు నల్లా, ఆస్తి పన్నులతో పాటు ట్రేడ్ లైసెన్సులకు సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించి కార్పొరేషన్ అభివృద్ధికి పాటుపడాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర కోరారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పన్ను వసుళ్ల కార్యకలాపాల నిమిత్తం నగరంలోని 30వ డివిజన్లో వ్యాపార వసూళ్ల లైసెన్సులు 41వ డివిజన్ లో ఆస్తి పన్నుల వసూలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ నిధులతో పాటు ప్రజలు కూడా సకాలంలో కార్పొరేషన్ కు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాలన్నారు. అదే విధంగా చెత్త రహిత కార్పొరేషన్ కోసం కృషి చేస్తున్నందున ప్రతి ఒక్కరు తడి, చెత్త పొడి చెత్త వేరువేరుగా వాహనాలకు అందించాలని కోరారు. వీధుల వెంట ఎక్కడపడితే అక్కడ చెత్త వేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గడ్డం శ్రీనివాస్, నంద్యాల ప్రదీప్ రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.