పెన్పహడ్, సెప్టెంబర్ 5: సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయాలజీ టీచర్‌గా పని చేస్తున్న మారం పవిత్ర 2025 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకైక ఉపాధ్యాయురాలు మారం పవిత్ర శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఢిల్లీలోని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అమెరికాలాంటి దేశాల్లో విద్యా విధానం ఎలా ఉందో విద్యార్థులకు స్పష్టంగా అర్థమయ్యేలా చేసేందుకు విద్యా వారధి కార్యక్రమం ప్రవేశపెట్టారు.
విద్యా వారధిలో స్కూల్ పిల్లలు అమెరికాలోని విద్యార్థులతో ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు జూమ్ ద్వారా ఇంటరాక్ట్ అవుతారు. 2019లో అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ టీచర్ అవార్డు, 2021లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవా ర్డు, టెక్ మహింద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించిన సైన్స్ ఉపాధ్యాయ పోటీల్లో ట్రాన్ఫార్మింగ్ అవార్డు, 2023లో నేషనల్ సైన్స్‌డే సందర్బంగా సారాబాయి టీచర్ సైంటిస్ట్ నేషనల్ అవార్డును జమ్ముకాశ్మీర్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రవిశంకర్ చేతుల మీదుగా అందుకున్నారు. 2023-24లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపధ్యాయురాలి అవార్డు, 2025లో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా భారత రాష్ట్ర పతి చేదుల మీదుగా అవార్డు అందుకున్నారు.