కట్టంగూర్, జనవరి 3 : కట్టంగూర్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మేకల సాంబయ్య భిక్షమమ్మల కుమార్తె పావనికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ లభించింది. జేఆర్ఎఫ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కామర్స్ విభాగంలో వర్సిటీ ప్రొఫెసర్ కృష్ణ చైతన్య పర్యవేక్షణలో కామర్స్‌లో ఎకో పిలిగ్రీమి టూరిజంలోని కంపారిటీవ్ పరిశోధనలో ఆమెకు డాక్టరేట్ లభించింది. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన పావని ప్రస్తుతం అస్టిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఏఎస్ఓ)గా హైదరాబాద్‌లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుంది. పావనిని కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభినంధించారు. తన పరిశోశోధనకు సహకరించిన ప్రొఫెసర్ కృష్ణ చైతన్యతో పాటు తల్లిదండ్రులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.